తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఎస్జే సూర్య (SJ Suryah). తమిళంలో హీరో కమ్ డైరెక్టర్‌గా, ప్లే బ్యాక్ సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ గా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ క్రేజీ యాక్టర్ తెలుగులో డైరెక్టర్‌గా, విలన్‌గా అందరికీ పరిచయం. మహేశ్ బాబుతో నాని సినిమా తీసిన ఎస్జే సూర్య, ఆ తర్వాత స్పైడర్‌లో విలన్‌గా కూడా నటించాడు.
ఇక పవన్ కల్యాణ్ (Pawankalyan) హీరోగా ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషీ (Khushi)ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య టాలీవుడ్ హీరో రాంచరణ్ (Ram Charan) సినిమాలో భాగం కాబోతున్నాడన్న వార్త ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 15 (RC 15)ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు రాంచరణ్. ఈ చిత్రంలో ఎస్జే సూర్య కీ రోల్ చేస్తున్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం ముఖ్యమంత్రి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడట ఎస్జే సూర్య. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రీసెంట్గా ఎస్జే సూర్య డాన్ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో నటించి..తన యాక్టింగ్‌తో అందరినీ మెప్పించాడు. ఆర్సీ 15 సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఆర్సీ 15లో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఎస్ థమన్ ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.