Prabhas | మళ్లీ ట్రాక్‌పైకి ప్రభాస్-మారుతి సినిమా…కొత్త అప్డేట్లో నిజమెంత..!
మారుతి నెక్ట్స్ ప్రభాస్ (Prabhas)తో చేయబోయే చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో ఉండబోతుందని కొందరు అంటుంటే..లేదు యాక్షన్ డ్రామాగా రాబోతుందని మరికొందరు తెగ డిస్కస్ చేశారు. మరోవైపు ప్రభాస్ ఇంతలోనే పక్కా కమర్షియల్ ఫలితాన్ని చూసి మారుతి చిత్రాన్ని క్యాన్సిల్ చేశాడని న్యూస్ తెరపైకి వచ్చింది.
రీసెంట్గా పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi). ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ఫలితం ఎఫెక్ట్ మారుతి నెక్ట్స్ ప్రభాస్ (Prabhas)తో చేయబోయే మూవీపై పడిందని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. ఓ వైపు ప్రభాస్‌తో చేయబోయే ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో ఉండబోతుందని కొందరు అంటుంటే..లేదు యాక్షన్ డ్రామాగా రాబోతుందని మరికొందరు తెగ డిస్కస్ చేశారు.
మరోవైపు ప్రభాస్ ఇంతలోనే పక్కా కమర్షియల్ (Pakka Commercial) ఫలితాన్ని చూసి మారుతి చిత్రాన్ని క్యాన్సిల్ చేశాడని న్యూస్ తెరపైకి వచ్చింది. కాగా ఇపుడిదే సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబో సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లబోతుందట. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు మాత్రం పండగే అన్నమాట. మరి దీనిపై రానున్న రోజుల్లో మారుతి నుంచి కానీ, ప్రభాస్ నుంచి కానీ ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
ప్రభాస్ పక్కా ఎంటర్టైనింగ్ రోల్లో కనిపించక చాలా కాలమే అవుతుంది. మరి మారుతి సినిమాతో ఈ పాన్ ఇండియా స్టార్ హీరో తనలోని ఫన్ యాంగిల్ ను మరోసారి చూపించబోతున్నాడా..? అనేది మరికొంత కాలం ఆగితే క్లారిటీ రానుంది.
Read Also : Pushpa 3 | ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట..ఫహద్ ఫాసిల్ క్లారిటీ..!
Read Also : Nithya Menen | పెళ్లికి రెడీ అవుతున్న నిత్యమీనన్..వార్తల్లో నిజమెంత..?
Read Also : Sam Akshay Promo | సామ్‌ను మోసుకొచ్చిన అక్షయ్‌కుమార్..ఫన్నీగా ప్రోమో
Read Also : Pushpa 2 | క్రేజీ టాక్..పుష్ప 2 లో ‘హ్యాపీ’ కాంబినేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

