Pushpa 3 | ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట..ఫహద్ ఫాసిల్ క్లారిటీ..!
పుష్ప (Pushpa)లో కీ రోల్ చేశాడు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో వచ్చిన పుష్ప మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్ ప్రాజెక్టు సెట్స్ పైకి రాకముందే మరో ఇంట్రెస్టింగ్ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar), రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప (Pushpa). మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్ చేశాడు. అజయ్ ఘోష్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో వచ్చిన పుష్ప మంచి వసూళ్లు రాబట్టింది. ఇక త్వరలోనే సుకుమార్ టీం (Pushpa 2)ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది.
ఇక సీక్వెల్ ప్రాజెక్టు సెట్స్ పైకి రాకముందే మరో ఇంట్రెస్టింగ్ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అదేంటంటే పుష్ప మూడో పార్టు. అవును మీరు చదివింది నిజమే. పుష్ప 3 (Pushpa 3)కూడా ఉండబోతుందని ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil ) కన్ఫార్మ్ చేశాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ.. కంటెంట్ వల్ల పుష్పను సుకుమార్ నెట్‌ఫ్లిక్స్ లో సిరీస్‌లా విడుదల చేద్దామనుకుంటున్నారన్నాడు.
పుష్ప 3 కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. ఇటీవలే సుకుమార్ నాకు కాల్ చేశారు. పుష్ప 3వ పార్టు కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానన్నారు. ఎందుకంటే పుష్ప కథలో అటువంటి అంశాలున్నాయని చెప్పుకొచ్చాడు. భన్వర్ సింగ్ షెకావత్‌గా అందరినీ మెప్పించాడు ఫహద్ ఫాసిల్. అల్లు అర్జున్-ఫహద్ ఫాసిల్ మధ్య ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండానే తొలి పార్టు ముగించాడు సుకుమార్.

మరి రెండో పార్టులో ఈ ఇద్దరి కాంబినేషన్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది తెలియాల్సి ఉంది. ఇక పుష్ప 3 కూడా ఉంటుందని చెప్పడంతో ఎన్ని ఎలిమెంట్స్ ను చూపిస్తాడని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Read Also : Nithya Menen | పెళ్లికి రెడీ అవుతున్న నిత్యమీనన్..వార్తల్లో నిజమెంత..?
Read Also : Sam Akshay Promo | సామ్‌ను మోసుకొచ్చిన అక్షయ్‌కుమార్..ఫన్నీగా ప్రోమో
Read Also : Pushpa 2 | క్రేజీ టాక్..పుష్ప 2 లో ‘హ్యాపీ’ కాంబినేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Fahadh Faasil
- Pushpa 3
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

