బాలీవుడ్ (Bollywood) దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్టుగా వ్యవహరిస్తున్న షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan). బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సమంత (Samantha) ఈ హాట్ స్టార్ షోలో సందడి చేశారు. తాజాగా ప్రోమో (Sam Akshay promo)ను రివీల్ చేశారు మేకర్స్. ఈ షోకు సామ్‌ను మోసుకొచ్చాడు అక్షయ్. సామ్ విడాకుల అంశంతోపాటు రిలేషన్ షిప్స్ కు సంబంధించిన విషయాల గురించి ఈ షోలోమాట్లాడింది సామ్.
మీ క్లోజ్ ఫ్రెండ్స్ బ్యాచ్‌లర్ పార్టీకి హోస్ట్‌గా చేయాల్సి వస్తే..ఏ బాలీవుడ్ హీరోతో డ్యాన్స్ చేసేందుకు ఇష్టపడుతారు అని కరణ్ అడిగితే..రణ్ వీర్ సింగ్ పేరు చెప్పింది సమంత. ఈ షోలో ఇచ్చిన టాస్క్ ప్రకారం అక్షయ్, సమంత డిఫరెంట్‌గా డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఫన్నీ క్వశ్చన్స్,గేమ్స్, చిట్‌చాట్‌తో సాగుతున్న ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ ఎపిసోడ్ గురువారం సాయంత్రం 7 గంటలకు హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది.సంతోషం లేని వివాహాల (Unhappy Marriages)కు మీరే (కరణ్ జోహార్) కారణం అని అంటోంది సామ్. కాఫీ విత్ కరణ్ షోకు విజయ్ దేవరకొండ కూడా హాజరవగా..ఈ ప్రోమో రావాల్సి ఉంది.
Heart of gold and a dash of sexy & bold – our two new guests on the Koffee couch are bringing the heat this Thursday in an all new episode of #HotstarSpecials #KoffeeWithKaran S7 only on Disney+ Hotstar.
____@DisneyPlusHS @karanjohar @akshaykumar @Samanthaprabhu2 pic.twitter.com/Mxwt1ReLAJ
— Dharmatic (@Dharmatic_) July 19, 2022