అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మలయాళ ( Malayalam industry)భామ నిత్యమీనన్ (Nithya Menen). దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో టాప్లో ఉంటుంది. ఈ ఏడాది భీమ్లా నాయక్ లాంటి బ్లాక్ బాస్టర్ ప్రాజెక్టులో మెరిసింది. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన Modern Love వెబ్ సిరీస్లో కూడా నటించింది నిత్యమీనన్.
భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న నిత్యమీనన్..జీవితంలో కొత్త ముందడుగు వేయబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంగ్లీష్ డైలీలో వచ్చిన కథనం ప్రకారం నిత్యమీనన్ పెళ్లి పీటలెక్కేందుకు (wedding)సిద్దమవుతుందట. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందని కథనం సారాంశం. ఇంతకీ నిత్యమీనన్ పెళ్లి చేసుకోబోయేది ఏ బిజినెస్ మెన్నో అనుకునేరు. తాజా అప్ డేట్ ప్రకారం మలయాళ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందట.
ప్రస్తుతానికి ఆ స్టార్ హీరో ఎవరనేది సస్పెన్స్ లో ఉంది. ఇప్పటికే ఈ లవ్ బర్డ్స్ తమ కుటుంబాలను ఒప్పించి..పెళ్లి పనుల్లో కూడా మునిగిపోయారని జోరుగా చర్చ నడుస్తోంది. నిత్యమీనన్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబోతుందని తెలుస్తోంది.