బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నెక్ట్స్ బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభాస్‌తో కలిసి ప్రాజెక్టు కే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు కౌన్ బనేగా కరోర్‌పతి (KBC) సీజన్ 14 (KBC 14th season)తో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫాలోవర్లలో జోష్ నింపుతుంటాడు.
తాజాగా కేబీసీలో సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. కలర్ ఫుల్ పైజామా, తెలుపు షర్ట్‌లో బ్రౌన్ సన్ గ్లాసెస్ పెట్టుకుని షోలో సందడి చేశాడు అమితాబ్ బచ్చన్. ధరించడానికి పైజామా ఇచ్చాడు..చీర చిరిగినట్లు అనిపించింది, ముందు చిన్న పాకెట్స్, వెనుక నాడ ఉంది..అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అమితాబ్. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక తమ ఫేవరేట్ స్టార్‌ను ఇలా చూసి తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ఎప్పుడూ వింత కాంబినేషన్లలో అవుట్‌ఫిట్స్ ధరించే రణ్ వీర్ సింగ్(Ranveer Singh)ను ఏమైనా కలిశారా..? అంటూ అమితాబ్ బచ్చన్ ను ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది నెటిజన్లు. మొత్తానికి ఏదేమైనా బిగ్ బీ కొత్త ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
T 4350 –
पहन्ने, को दिया पजामा, लगा साड़ी को फाड़ा ;
आगे छोटी जेब दे दी, औ' पीछे लगा है नाड़ा !! pic.twitter.com/x4d4JQIJrO— Amitabh Bachchan (@SrBachchan) July 18, 2022