కృష్ణగాడి వీర ప్రేమగాథ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచె మనసు లాంటి డిఫరెంట్ లవ్ ట్రాక్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). ప్రస్తుతం వార్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీ సీతారామమ్ (Sita Ramam)ను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్నాడు. భూమిక చావ్లా సీతారామంలో బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్) భార్యగా నటిస్తోంది. తాజాగా మేకర్స్ భూమికా చావ్లా లుక్‌ను విడుదల చేశారు.
భూమిక ఒడిలో క్యూట్ పాపతో ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది భూమిక. మళ్లీ చాలా ఏండ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. యువకుడు సుమంత్‌కు రెండో సినిమా..కాగా భూమికకు మొదటి చిత్రం.
సీతారామంలో జెర్సీ ఫేం బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అదేవిధంగా పెళ్లి చూపులు ఫేం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలాజీ పాత్రలో నటిస్తుండగా.,రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్‌గా..అక్కినేని సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మగా నటిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన లుక్స్ విడుదల చేయగా..నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్ మరో కీ రోల్ పోషిస్తున్నాడు.
సీతారామం ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్.
Unveiling the first look of #BhumikaChawla as Mrinalini.
from #SitaRamam.@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika@iSumanth @Composer_Vishal @VyjayanthiFilms@SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/Edh6yo9L4i— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2022