Xiaomi Pad 8 : చైనాకు చెందిన మొబైల్ తయారీ బ్రాండ్ షావోమీ నుంచి ఇటీవల ప్యాడ్ 8 లాంఛ్ అయింది. ఇది ప్రీమియమ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. స్నాప్‌డ్రాగన్ 8, జనరేషన్ 4 చిప్సెట్, పవర్ఫుల్ బ్యాటరీ వంటివి దీని ప్రత్యేకతలు. ఈ నెల 17 నుంచి అమెజాన్, షావోమీ సైట్లలో ఆన్లైన్లో సేల్కు అందుబాటులో ఉంటుంది. షావోమీ ప్యాడ్ 8 లోని ప్రధాన ఫీచర్లు, ధరల వివరాలివి.
11 అంగుళాల 3.2కే డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆడియో, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8, జనరేషన్ 4 చిప్సెట్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్, షావోమీ హైపర్ ఓఎస్ 3, 9,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 67 వాట్స్ ఛార్జర్ ఇన్ బాక్స్, నాలుగేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, షావోమీ ఫోకస్ పెన్ ప్రో సపోర్ట్, 16,000 ప్రెజర్ లెవల్స్ సపోర్ట్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ, నానో టెక్చర్ వేరియెంట్, 13 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.
గ్రే, బ్లూ, పైన్ గ్రీన్ కలర్స్‌లో లభ్యం. ధరలు రూ.33,999/ రూ.36,999/ రూ.38,999. వివిధ కార్డులపై లాంఛింగ్ ఆఫర్ కింద రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో క్రియేటర్స్ ఎడిషన్, నానో టెక్చర్ వేరియెంట్ కూడా ఉన్నాయి. వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి.