Balakrishna Simplicity | బాలకృష్ణ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా..ట్రెండింగ్‌లో స్టిల్
క్రమశిక్షణ విషయంలో బాలయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. రీల్ లైఫ్‌లో యాక్షన్, కామెడీ, డ్యాన్స్ , యాక్టింగ్ స్టైల్‌తో అదరగొట్టే బాలకృష్ణకు కోట్లాదిమంది అభిమానులున్నారు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) చూడటానికి కొంచెం గంభీరంగా..కోపం ప్రదర్శిస్తున్నట్టు కనిపించినా.. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఆయనదని చాలా మంది అంటుంటారు. క్రమశిక్షణ విషయంలో బాలయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. రీల్ లైఫ్‌లో యాక్షన్, కామెడీ, డ్యాన్స్ , యాక్టింగ్ స్టైల్‌తో అదరగొట్టే బాలకృష్ణకు కోట్లాదిమంది అభిమానులున్నారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ..సింపుల్‌గా కనిపించేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు ఈ నందమూరి హీరో. బాలయ్య సింప్లిసిటీ (Balakrishna Simplicity)ఎలా ఉంటుందో చెప్పే స్టిల్ ఒకటి తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్న ఎన్బీకే 107 (NBK 107 )షూటింగ్ కర్నూల్ (kurnool) పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. హీరో అనగానే షూటింగ్ అయిపోగానే క్యారవాన్ లోకి వెళ్లి తమ పనుల్లో మునిగిపోతుంటారు.
కానీ బాలకృష్ణకు మాత్రం షూటింగ్ స్పాటే క్యారవాన్. అందుకు ఈ ఫొటోనే నిదర్శనం. బాలకృష్ణ షూటింగ్ లొకేషన్లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో చల్లగాలిని ఆస్వాదిస్తూ..ప్లాస్టిక్ కుర్చీపై సాదాసీదాగా కూర్చొని లంఛ్ చేస్తున్నాడు. ఇపుడీ ఫొటోను చూసిన అభిమానులు సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని అంటున్నారు.

బాలకృష్ణ చాలా కాలం నుంచి ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. కాస్ట్యూమ్స్ చేంజ్, విశ్రాంతి కోసం మాత్రమే క్యారవాన్ (caravans)ను వినియోగించే ఈ హీరో..మిగిలిన పనుల్లో మాత్రం సింపుల్‌గానే కనిపిస్తుంటారు.
Read Also : Pushpa 3 | ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట..ఫహద్ ఫాసిల్ క్లారిటీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

