టాలీవుడ్ (PSPK28) యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్ లో సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రాజెక్టు హరీష్‌శంకర్ (Harish Shankar)తో పవన్ చేయబోయే 28వ (PSPK28) ప్రాజెక్టు తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ లెక్కన పవన్-సురేందర్ రెడ్డి సినిమాకు ఇంకా చాలా టైం ఉన్నట్టే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు అప్డేట్ ఒకటి ఇపుడ్ హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా మొదలవకముందే ఈ సినిమాకు భారీ డీల్‌ను సెట్ చేశారట మైత్రీ మూవీ మేకర్స్. పవన్-సురేందర్ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ5 దక్కించుకున్నట్టు టాక్. అంతేకాదు థ్రియాట్రికల్ రైట్స్ , నెగెటివ్ రైట్స్ తీసుకునే విషయంలో జీ నెట్ వర్క్ భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకునేలా చర్చలు జరుపుతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. (PSPK29)గా రాబోతున్న ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకముందే ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఈ చిత్రంపై ఇంకా ఎలాంటి క్రేజీ అప్డేట్స్ వస్తాయో చూడాలి.
పవన్ కల్యాణ్, రానా కాంబోలో వస్తున్న భీమ్లానాయక్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు క్రిష్ తో హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నాడు పవన్‌కల్యాణ్. నిధి అగర్వాల్ (Nidhi agarwal) హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు