టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ప్రాజెక్టు వకీల్‌సాబ్. పింక్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీ వెర్షన్ ట్రైలర్ కంటే ఎక్కువగా వకీల్‌సాబ్ ట్రైలర్ లో కొత్తగా ఏం చూపించలేదు. అయితే వకీల్‌సాబ్ లో ప్లాష్ బ్యాక్ స్టోరీకి సంబంధించిన న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో పవన్ లా కాలేజీలో విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడని టాక్.
అన్యాయం జరిగిన వారికి అండగా నిలిచే వ్యక్తిగా కనిపిస్తాడట..ఇదే క్రమంలో లవ్ ట్రాక్, ఆ తర్వాత పెండ్లి ఉంటుందట. పవన్ చేతిలో పట్టుకున్న హ్యాండ్ వాచ్ ను అతని భార్య కానుకగా ఇస్తుందని, ఆ సన్నివేశం తర్వాత ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు భార్యతో విడిపోవడం, లా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న పవన్..ముగ్గురు అమ్మాయిల కోసం కోటు వేసుకుంటాడని ఇన్ సైడ్ టాక్.
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
స్కై బ్లూ డ్రెస్ లో కట్టిపడేస్తున్న సారా..ఫొటోలు వైరల్
లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్