Lok Sabha Elections | నామినేషన్లకు నేడే ఆఖరు.. ఇప్పటివరకు 478మంది దాఖలు
లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
- నేడు కేంద్ర ఎన్నికల పరిశీలకుల రాక
Lok Sabha Elections | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ర్టానికి సాధారణ, శాంతి భద్రతల, ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. వీరు గురువారం ఆయా నియోజకవర్గ కేంద్రాలకు చేరుకోనున్నారు. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు, శాంతిభద్రతల పరిశీలకులుగా ఐపీఎస్ అధికారులు, వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్, ఐటీకి చెందిన అధికారులను నియమించారు. వీరు ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి, రాజకీయ పార్టీల ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు.
పోలింగ్ కేంద్రాలకు మే 12న సెలవు
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మే 12న, జూన్ 4న సెలవుదినాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ఆయా విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలకు ముందురోజు కూడా సెలవు ఇవ్వాలనే ఉద్దేశంతో మే 12న సెలవు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

