e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News స్వహస్తాలతో లేఖ రాసిన ఎన్టీఆర్..సోష‌ల్ మీడియాలో వైర‌ల్

స్వహస్తాలతో లేఖ రాసిన ఎన్టీఆర్..సోష‌ల్ మీడియాలో వైర‌ల్

స్వహస్తాలతో లేఖ రాసిన ఎన్టీఆర్..సోష‌ల్ మీడియాలో వైర‌ల్

న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక పేజిని లిఖించుకున్న మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు .ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నంద‌మూరి తార‌కరామారావు ఒకరు. మే 28న ఆయ‌న జ‌యంతి ఉత్సవాల‌ను కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

ఎన్టీఆర్‌కు అశేష అభిమాన గ‌ణం ఉంది. 1975వ సంవ‌త్సరంలో ఆయ‌న స్వ‌హ‌స్తాల‌తో గ్రీన్ ఇంక్ పెన్ ఉప‌యోగించి అభిమానుల‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుతూ లేఖ రాసారు .‘‘అభిమానమును మించిన ధనము ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరు ప్రేమాను రాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు’’ అని లేఖను ముగించారు. 1975వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన ఈ లేఖను రాయ‌గా, ప్ర‌స్తుతం ఈ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

స్వహస్తాలతో లేఖ రాసిన ఎన్టీఆర్..సోష‌ల్ మీడియాలో వైర‌ల్

ఇవి కూడా చదవండి..

అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్‌ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్‌
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్‌ ప్రధాని
స్టార్‌ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్‌ 9 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్వహస్తాలతో లేఖ రాసిన ఎన్టీఆర్..సోష‌ల్ మీడియాలో వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement