శుక్రవారం 10 జూలై 2020
Cinema - May 29, 2020 , 22:49:32

కరోనా ఇతివృత్తంతో

కరోనా ఇతివృత్తంతో

‘అ!’, ‘కల్కి’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రశాంత్‌వర్మ. కరోనా వైరస్‌ నేపథ్యంలో తాజా చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నారాయన.  ప్రశాంత్‌వర్మ జన్మదినం సందర్భంగా ఈ చిత్ర ప్రీలుక్‌, మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదలచేశారు.  కొండారెడ్డి బురుజు ముందు భయంకరమైన ఆకారం జనాల్ని చంపుతున్నట్లుగా మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తోంది. ‘కరోనా వాజ్‌ జస్ట్‌ ది బిగినింగ్‌' అంటూ చివరలో వచ్చే క్యాప్షన్‌ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. విజువల్స్‌, నేపథ్య సంగీతం ఆసక్తిని పంచుతున్నాయి.  ‘కరోనా మహమ్మారిపై తొలి  సినిమా ఇది. ఇప్పటివరకు ఎవరూ స్పృశించని సరికొత్త కథాంశంతో తెరక్కిస్తున్నాం. లాక్‌డౌన్‌ విధించడానికి ముందే నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.


logo