గణపతి పూజ ఎలా చేయాలి? కావాల్సిన సామగ్రి ఏంటంటే..
Ganesh Chaturthi 2022 | ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు తలెత్తకుండా ఉండాలంటే స్వామిని స్మరించుకోవాలి. విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు. అన్ని దేవుళ్ల కన్నా ముందు పూజలందుకొనే అర్హత ఉన్నవాడు. భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి. ఈ రోజు నుంచి నవరాత్రులు స్వామి వారిని పూజించి భక్తులు ఆశీస్సులు పొందుతుంటారు. పూజ ఎలా చేయాలంటే.. ముందుగా సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి.

కావాల్సినవి:
గణపతి మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు, మూడు ఉద్ధరిణలు, ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, యజ్ఞోపవీతం

అలంకరణ ఇలా..
పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పరిచి, పూర్ణకుంభంలో కొత్త బియ్యం వేసి, వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించాలి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేత గడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. గొడుగు పెట్టాలి.

మహానైవేద్యం
నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే శక్తి మేరకు రకరకాల పిండి వంటలు చేయవచ్చు. ఉండ్రాళ్లు, పాయసం గణపతికి ఇష్టమైన నైవేద్యం.

పంచామృతం
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార

పూజా విధానం
ఓం శ్రీ మహాగణాధిపతయే నమ: అని చెప్పి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.. శ్లోకం చదివి పూజను ప్రారంభించాలి. ముందుగా ఆచమనం.. ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి. తర్వాత గణపతికి నమస్కరించి దైవ ప్రార్థన చేయాలి. ఇందులో భాగంగా.. భూతోచ్చాటన, ప్రాణాయామం, సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి. అనంతరం పుష్పాలతో పూజిస్తూ అథాంగ పూజ నిర్వహించాలి. 21 రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి. అథ దూర్వాయుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేయాలి. పూజ పూర్తయ్యాక గణపతి వ్రత కథను వినాలి లేదా చెప్పుకోవాలి. వినాయక చవితి పద్యాలు చదవాలి. అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి. చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్ఠాంగ నమస్కారం చేయాలి.

Read More :
“గణపతికి కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? “
Ganesh Chaturthi 2022 | గణేశుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం?
పూరీ జగన్నాథుడిని గణపతి రూపంలో ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కథ ఇదే..
ఏకదంతుడిని ఎన్ని పత్రాలతో పూజించాలి? వినాయకుడి పూజకు వాడే ఆకులతో ఎలాంటి లాభాలున్నాయి?
Ganesh Chaturthi 2022 | వినాయకుడి వాహనం అయిన మూషికం గురించి ఈ విషయాలు తెలుసా !
ఈ 8 వినాయక మందిరాలను దర్శిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోవాల్సిందే
నవరాత్రుల్లో గణేశుణ్ని ఏ రోజు ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలి?
Ganesh Chaturthi | వినాయకుడి ఈ రూపాలకు ఉన్న విశిష్టత ఏంటో తెలుసా!!
Ganesh Chaturthi 2022 : గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామగ్రి ఏంటంటే..
Vinayaka Chavithi | గణేశుడికి తులసిదళం ఎందుకు సమర్పించరు?
Vinayaka Chavithi | అరుదైన రూపాల్లో వినాయకుడు కనిపించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?
“Ganesha in world | విదేశాల్లో మన వినాయకుడు.. ఏ దేశంలో ఏ పేరుతో పిలుస్తారంటే..”
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

