మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం బీబీనగర్ మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన...
బీబీనగర్, నవంబర్ 03 : గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం బీబీనగర్ మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గిరిజన మహిళలు వైద్యం కోసం 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. పౌష్టికాహార లోపం కారణంగా చిన్నారుల భవిష్యత్ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు ఉండటమే అభివృద్ధి కాదని, ఆ సదుపాయాలు మారుమూల ప్రాంతాల్లోని పేదలు, బలహీన వర్గాలకు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
బీబీనగర్‌లో ప్రతిపాదించిన ట్రైబల్ హెల్త్ అండ్ ఎకనామిక్ ఎక్సలెన్స్ కార్యక్రమం గిరిజన ప్రజలకు వైద్యం, పరిశోధన, విద్యా అవకాశాలను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. స్థానిక గిరిజన యువతకు ఆరోగ్య రంగంలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించి తమ సమాజానికి సేవ చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందించేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయనే కారణంతో అక్కడి ప్రజలకు వైద్య సేవలు దూరం కాకూడదని, వైద్యులు గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

