Ganesh Chaturthi 2022 | పండుగ రోజు ఉదయం లేవగానే పొలానికెళ్లి బంకమట్టి తీసుకొస్తాం.ఆ మట్టి వినాయకుడిగా రూపుదిద్దుకుంటుంది. కండ్లకు గురివింద గింజలు పెడతాం. పళ్లు, బొట్టు సున్నంతో రాస్తాం. చిన్న కర్రపుల్ల తీసుకొని చేతులు, తొండం, కాళ్ల ఆకృతిని గీసి అచ్చు వినాయకుడి రూపం తీసుకొస్తాం. ఆ తర్వాతే పూజా కార్యక్రమం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మార్కెట్లో దొరికే రసాయనవిగ్రహాలను కొనుగోలు చేసి పూజ మొదలు పెడుతున్నారు. వీటిని నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లుతున్నది. పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా గణేశుడిని తయారు చేయడం అన్ని విధాలా మంచిది.
బంకమట్టితో చేసిన వినాయకుడిని చూస్తే కలిగే అనుభూతి మార్కెట్లో దొరికే ఏ విగ్రహాన్ని చూసినా రాదు. మట్టి విగ్రహం కచ్చితంగా ఈ ఏడాది వేడుకలకు సంప్రదాయ ఆకర్షణను తెస్తుంది. ఈ విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలి. బాగా అలంకరించిన ప్రదేశంలో గణేశుడిని పెడితే అందంగా ఉంటుంది. అలాగే పండుగ ముగిసిన తర్వాత మట్టి విగ్రహాన్ని చిన్న బకెట్లో ముంచితే మట్టంతా కరిగిపోతుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
పేరు వినగానే ఆశ్చర్యపోకండి. నిజమే. ఈ విగ్రహాలు కరిగితే చాలు, మొక్కలుగా మారుతాయి. పలు పర్యావరణ సంస్థలు తులసి తదితర విత్తనాలతో గణేశుడి విగ్రహాలు తయారు చేస్తున్నాయి. వేడుకలు పూర్తయిన వెంటనే విగ్రహాన్ని నదులలో ముంచడం కంటే భూమిలో నాటడం వల్ల ఏడాది పొడవునా గణేశుడి ఆశీర్వాదం పొందినవాళ్లం అవుతాం. తోటలో నాటి కొద్దిగా నీళ్లు పోస్తే.. విగ్రహం కాస్తా కరిగి.. రెండు రోజుల తర్వాత మొక్కలు మొలకెత్తుతాయి.
కొన్ని స్వచ్ఛంద, పర్యావరణ సంస్థలు ఆవుపేడతో విగ్రహాలు తయారుచేస్తున్నాయి. ఈ రకం విగ్రహాలను పండుగ తర్వాత గార్డెన్లో పెడితే సరిపోతుంది. వర్షానికి ఎరువుగా మారి మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఏవైనా కారణాలతో విగ్రహాలను పూజించే అవకాశం లేకపోతే.. వినాయక చవితి రోజున ఇంటికి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి అర్చించినా సరిపోతుంది. కాదూ, మనమే పూజ చేయాలని అనుకుంటే.. ఇంట్లో వినాయకుడి విగ్రహం లేదా ఫొటోఉంటే దానికి పందిరి వేసి పండ్లు, తోరణాలతో వేడుకను ఘనంగా చేసుకోవచ్చు. వేడుక ముగిశాక మళ్లీ విగ్రహాన్ని యథాస్థానానికి మార్చవచ్చు. ఇలా చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మన ఇంట్లోని వినాయకుడికే పూజ చేసినట్లూ ఉంటుంది.
గణేశుని విగ్రహాలను పర్యావరణానికి హానిచేయని బంకమట్టితోనే కాదు.. పేపర్లు, అట్టముక్కలు, గాజుతోనూ రూపొందించవచ్చు. వీటిని నీటిలో నిమజ్జనం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందమైన మూర్తిని ఇంట్లోని షెల్ఫ్‌లో పెట్టుకోవడానికి ఇదొక మంచి మార్గం. కాకపోతే, సంప్రదాయం ప్రకారం ఇవి పూజకు పనికిరావు. అలంకరణకు మాత్రం అద్భుతంగా సరిపోతాయి. అతిథులను ఇట్టే ఆకర్షిస్తాయి కూడా.
“గణపతికి కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? “
Ganesh Chaturthi 2022 | గణేశుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం?
పూరీ జగన్నాథుడిని గణపతి రూపంలో ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కథ ఇదే..
ఏకదంతుడిని ఎన్ని పత్రాలతో పూజించాలి? వినాయకుడి పూజకు వాడే ఆకులతో ఎలాంటి లాభాలున్నాయి?
Ganesh Chaturthi 2022 | వినాయకుడి వాహనం అయిన మూషికం గురించి ఈ విషయాలు తెలుసా !
ఈ 8 వినాయక మందిరాలను దర్శిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోవాల్సిందే
నవరాత్రుల్లో గణేశుణ్ని ఏ రోజు ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలి?
Ganesh Chaturthi | వినాయకుడి ఈ రూపాలకు ఉన్న విశిష్టత ఏంటో తెలుసా!!
Ganesh Chaturthi 2022 : గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామగ్రి ఏంటంటే..
Vinayaka Chavithi | గణేశుడికి తులసిదళం ఎందుకు సమర్పించరు?
Vinayaka Chavithi | అరుదైన రూపాల్లో వినాయకుడు కనిపించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?
“Ganesha in world | విదేశాల్లో మన వినాయకుడు.. ఏ దేశంలో ఏ పేరుతో పిలుస్తారంటే..”