‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
ఎల్‌నినో ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని నల్లగొండ రూరల్ మండల ప్రత్యేక అధికారి, పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండ మండల సర్వసభ్య సమావేశంలో...
– వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి
– నల్లగొండ రూరల్ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ రమేశ్
నల్లగొండ రూరల్, నవంబర్ 03 : ఎల్‌నినో ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని నల్లగొండ రూరల్ మండల ప్రత్యేక అధికారి, పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండ మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మండల స్థాయి అధికారులు విధిగా పర్యటించి ప్రజలకు మెరుగైన వసతులు అందుతున్నాయో లేదో చూడాలన్నారు.
ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. ప్రస్తుతం కెనాల్ ద్వారా విడుదలవుతున్న నీటితో అన్ని గ్రామాల్లోని చెరువులను నింపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని గ్రామాల్లో తమ గ్రామాలకు నీరు అందకుండా కిందికి వెళ్లే కాలువలకు గండ్లు కొడుతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామాల్లో పట్టపగలే వీధి విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయని, విద్యుత్ వృథాను అరికట్టేందుకు లైట్లకు ఆన్-ఆఫ్ స్విచ్‌ల ఏర్పాటు చేయాలని సూచించారు. నీటితో పాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించేలా గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాకూబ్ నాయక్, ఎంపీఓ ఇస్మాయిల్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షఫీద్దీన్, ఏపీఎం వినోద, ఏవో శ్రీనివాస్, ఏపీవో స్ఫూర్తి, ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, వెటర్నరీ డాక్టర్లు కోట్ల సందీప్ రెడ్డి, పల్లవి, పి ఆర్ ఏ ఈ విజయకుమార్, ఐబిఏఈ మేఘన, దివ్య, సర్పంచులు మేకల పల్లవి అరవింద్ రెడ్డి, పెద్ది లక్ష్మీ గోవర్ధన్, జిల్లపల్లి రేణుక రాజు, వెంకట్ రెడ్డి, మహేశ్వరి, తీగల యాదయ్య, సాంబయ్య, హైమావతి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

