పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదో తరగతి, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు సంబందించి పరీక్ష ఫీజుల చెల్లింపుల్లో ప్రధానోపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల నుండి ఇప్పటికే పరీక్ష ఫీజులు వసూలు చేసిన ఆయా పాఠశాలల...
– ఫీజులు జమ చేసేందుకు ఇబ్బంది పడుతున్న హెచ్ఎంలు
– రాష్ట్ర వ్యాప్తంగా హెడ్ మాస్టర్లకు తప్పని తిప్పలు
రామగిరి, నవంబర్ 03 : తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదో తరగతి, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు సంబందించి పరీక్ష ఫీజుల చెల్లింపుల్లో ప్రధానోపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల నుండి ఇప్పటికే పరీక్ష ఫీజులు వసూలు చేసిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాలు వాటిని ఆన్లైన్లో ట్రెజరీ ద్వారా జమ చేసేందుకు ప్రయత్నంస్తుండగా సర్వర్ సమస్య కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చేతిలో ఉన్న విద్యాశాఖలోనే ఇలాంటి సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడంలో రోజలు గడుస్తుండంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 1 నుండి ప్రారంభం కావాల్సిన ఫీజుల జమ
పరీక్షల ఫీజుల చెల్లింపునకు విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 1 నుండి 17 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ఆన్లైన్ ఇంటిగ్రేషన్ ద్వారా పరీక్ష ఫీజులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ నెల 1 నుండి ఆన్లైన్ చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్న హెచ్ఎంలకు సర్వర్ అందుబాటులో లేకపోవడం, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ఒక్క పాఠశాలకో, ఒక్క జిల్లాకో పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. గడువు సమీపిస్తుండడంతో విద్యార్థుల పరీక్ష ఫీజులు సకాలంలో జమ చేయగలమా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

