రొటీన్ రెగ్యులర్ సినిమాలు చేయడానికి తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ కథా ప్రధానమైన సినిమాలు చేసే హీరోలు మాత్రం అరుదుగా ఉంటారు. అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సిన హీరో అడవి శేష్. ఒకప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చి.. ప్రతినాయకుడిగా నటించిన ఈయన ఇప్పుడు స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదనే ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దానికి కారణం ఆయన ఎంచుకునే కథలు. మిగిలిన హీరోలతో పోలిస్తే అడవి శేష్ ఎంచుకునే కథలు చాలా భిన్నంగా ఉంటాయి. రొటీన్ కమర్షియల్ మాస్ సినిమాలకు ఈయన చాలా దూరంగా ఉంటాడు. కామెడీ, పాటలు, ఫైట్లు అనే ఫార్ములా సినిమాలకు దూరంగా ఉండి.. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో డిఫెరెంట్ గా కథలు చెప్పి విజయం అందుకోవడం అడవి శేష్ ప్రత్యేకత. వరస విజయాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు శేష్.
క్షణం, గూడఛారి, ఎవరు లాంటి సినిమాలతో తన మార్కెట్ చాలా పెంచుకున్నాడు. దాంతో ఈయన కోసం నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ఎక్కడి వరకో ఎందుకు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ప్రస్తుతం ఈయనతో సినిమా నిర్మిస్తున్నాడు. మేజర్ అనే పాన్ ఇండియన్ సినిమాతో బిజీగా ఉన్నాడు అడవి శేష్. ఈ సినిమా 2021లోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగుతో పాటు మలయాళం, హిందీల్లోనూ ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు. గూడఛారి సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన శశికిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అడవి శేష్ అందిస్తుండటం విశేషం. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది.
టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ప్రతీ షాట్ కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. గూఢచారి తర్వాత మరోసారి శేష్ తో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ నటిస్తుంది. అలాగే దబంగ్ 3 ఫేమ్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ పిచ్చెక్కిస్తుంది. తెలుగు, మలయాళం, హిందీలో కలిపి దాదాపు 60 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే చాలా మంచి రేట్ కు మేజర్ అమ్ముడైంది. ఈ ఒక్క సినిమాతో అడవి శేష్ రేంజ్ టాప్ లెవల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలిక.. ఏం జరుగుతుందో..?
ఇవి కూడా చదవండి..
గంగవ్వ వాయిస్ ఓవర్ తో శ్రీవిష్ణు ప్రమోషన్స్..వీడియో
అక్కినేని అఖిల్ కెరీర్‌కు అనుకోని బ్రేకులు..!
ఆయుర్వేదిక్ బిజినెస్ లోకి జగపతిబాబు..?
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!