డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : ఎస్పీ నరసింహ
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా..
– సూర్యాపేటలో 500 మందికి పైగా డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 28 : డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వాహన డ్రైవర్లకు శనివారం సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రవి మహాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. చాలా కష్టతరమైన డ్రైవర్ వృత్తిని ఎంచుకుని ఆరోగ్యాలను లెక్క చేయకుండా డ్రైవర్లు నిర్విరామంగా కష్టపడుతున్నారన్నారు. వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమని, క్రమం తప్పకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : ఎస్పీ నరసింహ
కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. చాలా మంది డ్రైవర్లు కంటి చూపును అశ్రద్ధ చేస్తున్నారనే ఉద్దేశంతో స్థానిక లయన్స్ క్లబ్ డాక్టర్లు, గ్లోబల్ కంటి హాస్పటల్ డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలన్నారు. జిల్లాలో 2024లో 278 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా 2025లో జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల రోడ్డు ప్రమాద మరణాలు 58కి తగ్గించగలిగామన్నారు.

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : ఎస్పీ నరసింహ
ఈ సందర్భంగా డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన, పాటించాల్సిన నియమాలపై సమగ్రంగా వివరించారు. ఈ శిబిరం ద్వారా 500 మందికి పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దోసపాటి గోపాల్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, నరసింహారావు, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎంవీఐ లు సంపత్, సతీష్ కుమార్, కంటి డాక్టర్లు రంజిత్ కుమార్, స్వాతి, గ్లోబల్ హాస్పటల్ యాజమాన్యం క్రాంతి, భిక్షపతి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

