అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా.. అలా ఉంది ఇప్పుడు అఖిల్ అక్కినేని పరిస్థితి పాపం. కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా రవ్వంత అదృష్టం లేక అల్లాడిపోతున్నాడు ఈ పాతికేళ్ళ సిసింద్రి. ఏడాది వయసున్నపుడే బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈయన..హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఇప్పటి వరకు హిట్ కొట్టలేకపోయాడు. పైగా ఈయన కెరీర్ కు అనుకోని బ్రేకులు పడుతున్నాయి. కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్ళవుతున్నా కూడా ఇప్పటి వరకు అఖిల్ నుంచి వచ్చిన సినిమాలు మూడు మాత్రమే. అంటే రెండేళ్ళకు పైగానే ఒక్కో సినిమా కోసం తీసుకుంటున్నాడు అఖిల్. ఇది ఆయన ప్లాన్ చేసింది కాదు అనుకోకుండా అలా వచ్చేస్తుందంతే. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజు దాదాపు 50 కోట్ల మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడిగా ఉండేవాడు అఖిల్ అక్కినేని.
ఈయన తొలి సినిమా విడుదలకు ముందు సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భారీ హైప్.. అంతకుమించి బిజినెస్.. దానికి మించిన మార్కెట్.. అన్నీ బ్యాలెన్సింగ్‌లో ఉండి అఖిల్ తొలి సినిమా వచ్చింది. అఖిల్ పేరుతోనే వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 2015లోనే 30 కోట్ల బడ్జెట్.. 40 కోట్ల బిజినెస్ చేసింది అఖిల్. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయ్యుంటే కచ్చితంగా 50 కోట్ల షేర్ వసూలు చేసేది ఈ చిత్రం. ఎందుకంటే అంతటి డిజాస్టర్ టాక్ తోనే తొలిరోజే 8 కోట్ల షేర్ వసూలు చేసింది అఖిల్. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు ఏడేళ్ళుగా విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు అక్కినేని వారసుడు. అఖిల్ వచ్చిన రెండేళ్లకు కానీ హలో సినిమాతో రాలేదు అక్కినేని వారసుడు.
విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. 2017 చివర్లో హలో వస్తే.. 2019లో మిస్టర్ మజ్ను అంటూ వచ్చాడు ఈయన. ఇదొచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా 2020లోనే రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. దాంతో మరోసారి భారీ బ్రేక్ తప్పలేదు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ స్పై థ్రిల్లర్ కు ఓకే చెప్పాడు అఖిల్. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఏదేమైనా కూడా వరస సినిమాలు చేయాలనుకుంటున్నా.. కాలం కలిసిరావడం లేదు అఖిల్‌కు. అందుకే కెరీర్ లో సడన్ బ్రేకులు తప్పడం లేదు. మరి ఇవన్నీ ఎప్పటికి క్లియర్ అవుతాయో చూడాలిక.
ఇవి కూడా చదవండి..
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!