Virosh | విజయ్-రష్మిక పెళ్లిలో మెరిసిన ఈషా రెబ్బ-తరుణ్ భాస్కర్ .. త్వరలో వీరి పెళ్లి కూడా జరగనుందా?
Virosh | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి ఫోటోలే కనిపిస్తున్నాయి. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న చిత్రాలు క్షణాల్లో వైరల్ అవుతూ రికార్డులు క్రియేట్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వివాహ వేడుకలు ముగిసినా, ఆ సందడి మాత్రం ఇంకా తగ్గలేదు. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Virosh | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి ఫోటోలే కనిపిస్తున్నాయి. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న చిత్రాలు క్షణాల్లో వైరల్ అవుతూ రికార్డులు క్రియేట్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వివాహ వేడుకలు ముగిసినా, ఆ సందడి మాత్రం ఇంకా తగ్గలేదు. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకలో నటి ఈషా రెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్–రష్మికలకు అత్యంత సన్నిహితులైన ఈ ఇద్దరూ వివాహ వేడుకను ఉత్సాహంగా ఆస్వాదించారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు ఫోటోలను ఈషా రెబ్బ సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్నేహితుల పెళ్లిలో ఈ జంట సంతోషంగా గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక క్యూట్ ఫోటోలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బలతో పాటు దర్శకులు సందీప్ రెడ్డి వంగా,శివ నిర్వాణ తదితరులు చిరునవ్వులతో కనిపించడం విశేషం. ఆ ఫోటో చూస్తుంటే విజయ్–రష్మికల పెళ్లిలో టాలీవుడ్ వర్గం ఎంతగా సందడి చేసిందో అర్థమవుతోంది. ఇదిలా ఉండగా, తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బల వివాహం గురించిన వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని, అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి విజయ్–రష్మికల పెళ్లి సందడి మధ్య ఈ జంట కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇక విజయ్-రష్మికలు ప్రస్తుతం తమ రిసెప్షన్ వేడుక పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. మార్చి 4న తమ రిసెప్షన్ వేడుక జరగనుండగా, ఈ వేడుకకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ ఎత్తున హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

