టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu), కేథరిన్ థ్రెసా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భళా తందనాన (Bhala Thandhanana). చైతన్య దంతులూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 6న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో సాయంత్రం 7 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఎవరొస్తున్నారో తెలుసా..? ట్రిపుర్ ఆర్ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli).
వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామచంద్రరాజు, పోసాని కృష్ణమురళి, సత్య, క్రిష్ణ చైతన్య, శ్రీనివాస్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌కు, పోసాని సింగర్‌గా మారి తొలిసారి పాడిన గ్రీన్ టీ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీకి శ్రీకాంత్ విస్సా కథ-మాటలు సమకూరుస్తుండగా..మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.
Join The Grand Pre Release Event of #BhalaThandhanana Today at Trident Hotel, Hyderabad from 7PM Onwards 🤩
Ace Director @ssrajamouli Garu is the Chief Guest.@sreevishnuoffl @CatherineTresa1@chaitanyahead #ManiSharma @GarudaRaam @VaaraahiCC @MangoMusicLabel @SrikanthVissa pic.twitter.com/UbzpPuk0UH
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) May 3, 2022
హిట్టు,ప్లాప్‌తో సంబంధం లేకుండా కొత్తదనంతో కూడిన సినిమాలు చేసే శ్రీ విష్ణుకు ఈ చిత్రం ఏ స్థాయిలో కలిసొస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.