బార్బీ గర్ల్..బేబి డాల్..గుండె జిగేలు జిగేలు జిగేలు మంటుందే..బార్బీ గర్ల్..బేబి డాల్ గుండె గుబేలు గుబేలు గుబేలు మంటుందే..అంటూ సాగే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. మిర్చి సినిమాలోని ఈ పాట పాల బుగ్గల సుందరి హన్సిక (Hansika Motwani)కు సరిగ్గా సరిపోతుంది. హన్సికా తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలు, స్టిల్స్ చూస్తే అవును నిజమే అంటారంతా. హన్సికను చూసిన నెటిజన్లు ఇదే పాట పాడుకుంటున్నారు. సముద్రతీరంలోని రిసార్ట్స్ లో టూపీస్ బికినీలో మిల మిలా మెరిసిపోతుంది హన్సిక.
స్విమ్ షూట్లో ఉన్న హన్సికా కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికపుడు ఫాలోవర్లు, అభిమానులతో పంచుకుంటుందీ భామ. ఎప్పటిలా కాకుండా ఈ సారి మరింత హాట్‌గా కనిపిస్తూ అందరినీ పలుకరిస్తోంది హన్షిక. క్యూట్ అండ్ హాట్ ఎక్స్ప్రెషన్స్ తో నెటిజన్లకు కిస్ ఇస్తూ..అందరి మతులు పోగొడుతోంది హన్షిక. ఈ బ్యూటీ మాల్దీవులు వెకేషన్ (Maldives vacation)ను ఎంత బాగా ఎంజాయ్ చేసిందో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వీడియోను చూస్తే తెలిసిపోతుంది.
ఈ ఫొటోలు పోస్ట్ చేసిన తక్కువ టైంలోనే వైరల్ అవుతున్నాయి. హన్సిక పెట్టిన పోస్టులకు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంది. దేశముదురు (Deshamudhuru) సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హన్సిక. ప్రస్తుతం ఈ భామ 105 మినట్స్ (105 Minutes), మై నేమ్ ఈజ్ శృతి, మహా సినిమాలతో బిజీగా ఉంది.