మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక (Niharika Konidela) చాలా రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే సుమారు 8 వారాల తర్వాత మళ్లీ నెట్టింట అడుగుపెట్టింది నిహారిక. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా (Instagram account)ను రీయాక్టివేట్ చేసింది నిహారిక. సోషల్ మీడియా నుంచి తీసుకున్న ఈ విరామ సమయంలో 3 పాఠాలు నేర్చుకున్నానని చెప్పింది.
8 వారాల సుదీర్ఘ విరామ సమయంలో 3 పాఠాలు నేర్చుకున్నా..అవి 1) ప్రపంచం అంతం కాదు. 2) ఇతరులు ఏం చేస్తున్నారో..నేను నిజంగా పట్టించుకోలేదు. 3) నేను ఇపుడు పోస్ట్ చేయడానికి రిఫ్రెష్‌గా, ఎక్జయిటెడ్‌గా ఉన్నాను..అంటూ సైడ్ లుక్‌లో ఉన్న స్టిల్ ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేసి..తన ఎక్జయిట్ మెంట్‌ను షేర్ చేసుకుంది నిహారిక. తన డైలీ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుండే నిహారిక ఒక్కసారిగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
నిహారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మొత్తానికి ఇపుడు అన్నింటికి చెక్ పెడుతూ మళ్లీ నెట్టింట యాక్టివ్ కావడంతో నెటిజన్లు కొత్త అప్ డేట్స్ పై ఆసక్తిగా ఉన్నారు. 2016లో వచ్చిన ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహా రెడ్డి చిత్రాల్లో నటించింది. గతేడాది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నిహారిక..ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.