న్యాచురల్ స్టార్ నానితో కలిసి జెర్సీ సినిమాలో మెరిసింది ఉధంపూర్ సుందరి శ్రద్దాశ్రీనాథ్ (Shraddha Srinath). తెలుగులో తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకరిగా నిలిచింది. నెర్కొండ పర్వాయి, విక్రమ్ వేధ లాంటి ప్రాజెక్టులతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ మరో ఆసక్తికర సినిమాతో రెడీ అవుతోంది. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది శ్రద్దాశ్రీనాథ్.
మెట్రోపాలిటన్ సిటీల్లో కన్జర్వెన్సీ స్టాఫ్ (పరిరక్షణ సిబ్బంది) కథల నేపథ్యంలో తెరకెక్కుతున్నీ ఈ ప్రాజెక్టుకు టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోన్న పాన్ ఇండియాప్రాజెక్టు (Witness) టైటిల్ ఫైనల్ చేశారు. సీనియర్ నటి రోహిణి (Rohini Molleti) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇవాళ మేడే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. మల్టీలింగ్యువల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు. దీపక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
With the world of conservancy workers at its center, the movie WITNESS presents a never-seen-before view of metropolitan cities and the invisible corridors of power lying underneath them.#WITNESS First Look pic.twitter.com/JxyBweGxam
— Shraddha Srinath (@ShraddhaSrinath) May 1, 2022
ఈ సినిమాకు దీపక్ సినిమాటోగ్రాఫర్ కూడా. రమేశ్ తమిళమణి మ్యూజిక్ డైరెక్టర్. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ను అందించింది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్చూస్తుంటే శ్రద్దాశ్రీనాథ్, రోహిణి ఇద్దరూ కోర్టు రూంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మెట్రోపాలిటన్ నగరాల్లో మిస్సింగ్ కారిడార్ వెంట ఉన్న పరిరక్షణ కార్మికుల్లోని మునుపెన్నడూ చూడని కోణాన్ని Witnessలో చూడబోతున్నారంటూ ట్వీట్ చేసింది శ్రద్దాశ్రీనాథ్.
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు