హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సమగ్రాభివృద్ధికే తమ ప్రభుత్వం ‘క్యూర్.. ప్యూర్.. రేర్’ పాలసీ అవలంబిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ ప్రారంభించిన అనంతరం.. తెలంగాణ రైజింగ్-2047పై చర్చ జరిపారు. ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు, దళితుడు, గిరిజనుడు, మహిళ అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మహిళా సంఘాలను కార్పొరేట్ శక్తులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గత రెండేండ్లలో అగ్నిప్రమాద ఘటనల్లో 163 మంది చనిపోయినట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి బదులిస్తూ.. రాష్ట్రంలో 8,861 అగ్ని ప్రమాదాలు జరగగా, రూ.879 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు వివరించారు.