కన్నడ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) బుధవారం భారీ సర్ ప్రైజ్ ఉండబోతుందని ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో ప్రకటించేసింది నిర్మాత విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) టీం. కొత్త సినిమాను ప్రకటించారు. కన్నడ కంఠీరవ, లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్‌ను సిల్వర్ స్క్రీన్‌పై పరిచయం చేయబోతుంది హోంబలే ఫిలిమ్స్.
దివంగత పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువ రాజ్‌కుమార్. ఇంట్రడక్షన్ పోస్టర్లను విడుదల చేస్తూ వారసత్వం కొనసాగుతుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్‌తో యువరత్న లాంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో పలు హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సంతోష్ ఆనంద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
ಅಭಿಮಾನದಿಂದ ಅಭಿಮಾನಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಪಯಣ.
ಇರಲಿ ನಿಮ್ಮ ಅಪ್ಪುಗೆ
The legacy continues..@yuva_rajkumar @SanthoshAnand15 @VKiragandur @hombalefilms#IntroducingYuvaRajKumar #YuvaRajKumar pic.twitter.com/c4vsklAYFj— Hombale Films (@hombalefilms) April 27, 2022
యువ రాజ్ కుమార్ తొలి చిత్రాన్ని పునీత్ రాజ్ కుమార్‌కు అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది హోంబలే ఫిలిమ్స్ టీం. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ పాన్ ఇండియా స్టార్ యాక్టర్ ప్రభాస్ (prabhas)తో సలార్ (Salaar) సినిమా తెరకెక్కిస్తోంది. దీంతోపాటు కన్నడలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కంటారా అనే సినిమా నిర్మిస్తోంది.