బాలీవుడ్ ప్రేమపక్షులు కియారా (Kiara Advani)-సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) బ్రేకప్ అంశం కొంతకాలంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా డేటింగ్లో ఉన్న కియారా తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ (Break Up) చెప్పినట్టు వార్తలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కియారా అద్వానీ తన బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్‌తో ఉన్న పోస్టర్ ఫొటోను షేర్ చేసింది. సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన షేర్షా సినిమా హిట్ లిస్ట్ ఓటీటీ అవార్డ్స్ లో ఉత్తమ వెబ్ సినిమా (హిందీ)గా ఎంపికైంది. సిద్దార్థ్ మల్హోత్రా ఉత్తమ నటుడిగా, కియారా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
ధర్మ ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సిద్దార్థ్-కియారా ఉన్న పోస్టర్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందరి మనస్సులను గెలుచుకుని అవార్డులను గెలుచుకుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌ను కియారా రీ షేర్ చేస్తూ అందరినీ ఆలోచనలో పడేసింది. సిద్దార్ద్‌తో బ్రేకప్ వార్తల నేపథ్యంలో ఇలా తన సంతోషాన్ని షేర్ చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటోంది నిజమేనా..? లేదా వట్టి పుకార్లు మాత్రమేనా..? అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
ఇప్పటికే వచ్చిన బీటౌన్ సర్కిల్ టాక్ ప్రకారం ఈ లవ్ బర్డ్స్ వేరు కుంపటి పెట్టుకోవడం నిజమేనని టాక్ వినిపిస్తోంది. తాజాగా కియారా అద్వానీ పెట్టిన పోస్ట్ పక్కా ప్రొఫెషనల్‌గానే అయి ఉంటుందనేది కూడా నిజం కావొచ్చనుకుంటున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి రాబోయే కాలంలో బ్రేకప్ వార్తలపై ఇద్దరు ఏమైనా స్పందిస్తారేమో..!