అమెరికా పడవలను ముంచేస్తాం.. జాగ్రత్త!
రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్‌ను అమెరికా సీజ్ చేయడంతో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో రష్యన్ నేత అలెక్సీ ఝురవ్లెవ్ గురువారం అమెరికాను గట్టిగా హెచ్చరించారు. సముద్రాలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అమెరికా కొనసాగిస్తే, ఆ దేశాన్ని సైనికపరంగా ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పారు. తనను దండించేవారు లేరనే భావనతో అమెరికా వ్యవహరిస్తున్నదన్నారు.
- అగ్ర రాజ్యానికి రష్యా ఘాటు హెచ్చరిక
మాస్కో: రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్‌ను అమెరికా సీజ్ చేయడంతో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో రష్యన్ నేత అలెక్సీ ఝురవ్లెవ్ గురువారం అమెరికాను గట్టిగా హెచ్చరించారు. సముద్రాలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అమెరికా కొనసాగిస్తే, ఆ దేశాన్ని సైనికపరంగా ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పారు. తనను దండించేవారు లేరనే భావనతో అమెరికా వ్యవహరిస్తున్నదన్నారు.
దానిని దీటైన ప్రతీకార చర్యల ద్వారా నిలువరించాలని తెలిపారు. ‘టార్పెడోలతో దాడి చేయాలి, అమెరికన్ తీర గస్తీ పడవలను ముంచేయాలి. సాధారణంగా అమెరికా తనకు వేలాది కిలోమీటర్ల దూరంలో గస్తీ కాస్తుంది’ అని చెప్పారు. వెనెజువెలాలో స్పెషల్ ఆపరేషన్ తర్వాత అమెరికా తనకు ఎదురులేదనే యూఫోరియాలో ఉందని, దానిని ముక్కు మీద కొడితేనే ఆపగలమని అన్నారు. స్కాట్లాండ్ ఉత్తర దిశలోని అంతర్జాతీయ జలాల్లో రష్యా జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ మరినెరా, (బెల్లా 1)ను అమెరికన్ మిలిటరీ దళాలు జప్తు చేసిన కొద్ది గంటల్లో అలెక్సీ ఈ విధంగా స్పందించారు.
ట్యాంకర్లో ముగ్గురు భారతీయులు
అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా చమురు ట్యాంకర్లో ఉన్న మొత్తం 28 మంది సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని రష్యా గురువారం వెల్లడించింది. సిబ్బంది పట్ల మర్యాదపూర్వకంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అమెరికాకు రష్యా విజ్ఞప్తి చేసింది. సాధ్యమైనంత త్వరగా విదేశీయులందరినీ విడుదల చేయాలని కోరింది. నౌకలో 17 మంది ఉక్రెయిన్ జాతీయులు, ఆరుగురు జార్జియా దేశస్థులు, ముగ్గురు భారతీయులు ఉన్నారు. నౌక కెప్టెన్‌తోసహా ఇద్దరు రష్యన్ పౌరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా అమెరికా అధికారులకు బందీలుగా ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

