తెలుగు, కన్నడ భాషల్లో టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది రష్మిక మందన్నా. కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పాగా వేసే ప్రయత్నాల్లో ఉందీ భామ. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామకు ఓ అభిమాని ఆశ్చర్యపోయే ప్రశ్న వేశాడు. అయితే రష్మిక ఏ మాత్రం కోపం తెచ్చుకుండా సమాధానమిచ్చింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటనే కదా మీ డౌటు. రష్మికను పొగతాగే అలవాటు గురించి అడిగాడు ఓ అభిమాని.
మీరు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు అని రష్మికను ప్రశ్నించాడు. రష్మిక స్పందిస్తూ..నేను ఎప్పుడూ పొగతాగలేదు. తాగను. చుట్టూ ఎవరైనా పొగతాగేవారుంటే నాకు అసహ్యమేస్తుందని చెప్పింది. దీంతోపాటు తనకు సంబంధించిన మరో విషయం కూడా చెప్పింది రష్మిక. నేను 6 భాషలను సులభంగా (పాలీగ్లాట్) మాట్లాడగలనని తెలిపింది. హీరోయిన్లకు ఫిట్నెస్, భావవ్యక్తీకరణ (ఎక్స్ ప్రెషన్స్ )లో ఏది ముఖ్యమని అడుగగా..ఏ హీరోయిన్ కైనా కష్టపడి పనిచేయగలిగే సామర్థ్యం చాలా ముఖ్యమైందని జవాబిచ్చింది.
ఇవి కూడా చదవండి..
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో