Boney Kapoor | పుష్ప-2 స్క్రీనింగ్ సందర్భంగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద తొక్కిసలాట ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) తాజాగా స్పందించారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) తప్పేమీ లేదన్నారు. మహిళా అభిమాని మృతికి అల్లు అర్జున్‌ని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. ఈ ఘటనలో బన్నిని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. జనాలు ఎక్కువగా రావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు.
‘సౌత్ ఇండియాలో హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తమిళ్, తెలుగు స్టార్ హీరోల సినిమాలు విడుదల సమయంలో థియేటర్ల వద్ద వేలాది మంది బారులు తీరడం నేను స్వయంగా చూశాను. నేను నిర్మించిన అజిత్ సినిమాని చూసేందుకు అర్ధరాత్రి 1 గంటకు థియేటర్‌కు వెళ్లా. అప్పుడు థియేటర్ వెలుపల 20 వేల నుంచి 25 వేల మంది అభిమానులు ఉన్నారు. అంతమందిని చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇక సినిమా షో ముగించుకుని 3:30 నుంచి 4 గంటల మధ్య బయటకు వచ్చా. అప్పుడు కూడా చాలా మంది థియేటర్ బయట ఉన్నారు.
రజినీకాంత్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి అగ్ర నటుల చిత్రాల విడుదల సమయంలో ఇలానే జరుగుతుంది. ఆయా స్టార్స్ సినిమాల రిలీజ్‌లకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తారు. అలా జనాలు పరిమితికి మించి రావడం వల్లే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదు. ఆయన్ని నిందించాల్సిన అవసరం లేదు’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు.
కాగా, పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరుచేసిన కోర్టు రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ ఇటీవలే ముగియడంతో ఆయన వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో రేపు విచారణ జరగనుంది.
Also Read..
Allu Arjun | అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా.!
“Allu Arjun | అల్లు అర్జున్‌కు 105 సెక్షన్ వర్తించదు.. బెయిల్‌పై ముగిసిన వాదనలు”
“జనాలు చనిపోతే సినిమాపై ఏం మాట్లాడతాం”
“Allu Arjun | సంధ్య థియేటర్ ఘటన.. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్”
“రేవతి కుటుంబానికి 2కోట్ల సాయం”