హైదరాబాద్: సంధ్య థియేయర్ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో కోర్టుకు రానున్నారు. అయితే ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఆయన లాయర్లు కోర్టు దృష్టికి తీసుకురానున్నారు.
పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట ఘటనపై అరెస్టయిన అల్లు అర్జున్‌కు ఈ నెల 13న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరుచేసింది. రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. తొకిసలాటలో మరణించిన మహిళ భర్త ఫిర్యాదు మేరకు చికడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిసన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యజమానులు ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఇంకా అరెస్ట్ కాని ఇతర నిందితుల్లో నలుగురు సంధ్య థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులకు ఉత్తర్వులను జారీచేశారు.