హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘ఇక్కడ జనాలు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం..’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు. కడప జిల్లా పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘సినిమాల గురించి కాకుండా ప్రజా సమస్యలపై చర్చపెట్టండి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.