Pawan Kalyan – Allu Arjun | పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఆయన మాట్లాడుతూ.. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన అనంతరం ఆమె ఇంటికి వెళ్లి పరమర్శించాల్సింది. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించనట్లైంది. ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ సంతాపం తెలపకున్న.. చిత్రబృందం అయిన సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడంతో అతడిని అరెస్ట్ చేశారు అనడం సరికాదు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్న అలాగే అరెస్ట్ చేస్తారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు.