Allu Arjun | అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా.!
Verdict on Allu Arjun's bail petition | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై అల్లు అర్జున్‌కి బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Verdict on Allu Arjun’s bail petition | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై అల్లు అర్జున్‌కి బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. అల్లు అర్జున్ తరఫు లాయర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు ధర్మాసనంకు వినిపించారు. అయితే ఇరు పక్షల వాదానలు విన్న నాంపల్లి కోర్టు.. తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది.
పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరుచేసిన కోర్టు రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాజాగా ఈ రిమాండ్ ముగియడంతో అదే రోజు ఆయన వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడింది. అయితే నాంపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టి.. తీర్పును జనవరి 03కి వాయిదా వేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

