Mythri Movie Makers – Sandhya Theatre Stampede | పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre Stampede) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ అనే మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం భద్రతలోపం వలనే ఈ ఘటన జరిగినట్లు నోటీసులు పంపారు.
తాజాగా ఈ నోటీసులకు సంబంధించి థియేటర్ యాజమాన్యం సమాధానం వెల్లడించింది. డిసెంబర్ 04న పుష్ప 2 బెనిఫిట్ షోలో 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో పాల్గోన్నట్లు యాజమాన్యం తెలిపింది. అంతేగాకుండా.. డిసెంబర్ 04, 05న థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తీసుకున్నట్లు సంధ్య యాజమాన్యం వెల్లడించింది. అగ్ర హీరోల సినిమాల విడుదలకు గతంలోను ఈ థియేటర్‌కు నటులు వచ్చినట్లు.. వాళ్లు వచ్చిన కూడా పార్కింగ్ ఇబ్బంది రాకుండా కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని వెల్లడించింది. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని ఇది దురదృష్టకరం అని వెల్లడించింది. ఈ సందర్భంగా 6 పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం న్యాయవాదులతో పోలీసులకు అందజేసింది.