కేంద్ర మాజీ మంత్రి కావూరి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి శ్వాసకోశ సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో బంజారాహిల్స్‌లోని స్టార్ దవాఖానలో చేరారు. అక్కడ వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు.
- నేడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి శ్వాసకోశ సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో బంజారాహిల్స్‌లోని స్టార్ దవాఖానలో చేరారు. అక్కడ వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసానికి తరలించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన మనువడు, ఎంపీ శ్రీభరత్ తెలిపారు.
కావూరి సాంబశివరావు.. మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2014లో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2014 మే 1న బీజేపీలో చేరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతాల కోసం పదవులను వదిలేశారు. ఆయన మృతిపై తెలంగాణ, ఏపీకి చెందిన వివిధ పార్టీల నేతలు, పారిశ్రామిక వేత్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

