బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయండి
సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా ముంబై- హైదరాబాద్ హై స్పీడ్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్ ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,మాణిక్‌రావు ఆధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రిని కలిశారు.
- రైల్వే మంత్రికి ఎమ్మెల్యేల విజ్ఞప్తి
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 23: సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా ముంబై- హైదరాబాద్ హై స్పీడ్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్ ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,మాణిక్‌రావు ఆధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపాదిత ముంబై- హైదరాబాద్ హై స్పీడ్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్ భాగంగా జహీరాబాద్, సంగారెడ్డిలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌కు అత్యంత సమీప జిల్లా కేంద్రం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాద్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఔషధ పరిశ్రమలు, జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.
జహీరాబాద్‌లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలి
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్‌లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరిపాలన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. రేక్ పాయింట్ ద్వారా వ్యవసాయ, ఎరువులు, ధాన్యం, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్ ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం అవుతాయని చెప్పారు.
రవాణా వ్యయాలు తగ్గి పరిశ్రమల పోటీతత్వం పెరగడంతో పాటు రైతులు, వ్యాపారులు ప్రత్యక్షంగా లబ్ది పొందుతారని పేర్కొన్నారు. దేశంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతున్న జహీరాబాద్‌లో 12,656 ఎకరాల్లో నిమ్జ్, జహీరాబాద్ ఇండస్ట్ట్రియల్ స్మార్ట్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు అమలవుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అత్యంత అవసరమని వివరించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించిన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యేలు వెల్లడించారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

