చందంపేట(దేవరకొండ), మార్చి 11 : ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో చందంపేట మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు 200 మంది బుధవారం బీఆర్ఎస్లో చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన పేరుతో సేకరించిన 25 ఎకరాల భూమిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.