కావూరికి కేటీఆర్ నివాళి
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 11(నమస్తే తెలంగాణ) : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2013లో తన ఆహ్వానం మేరకు కేంద్ర టెక్స్టైల్ మినిస్టర్‌గా ఉన్న కావూరి సాంబశివరావు సిరిసిల్ల పర్యటనకు వచ్చారని, సిరిసిల్లలో పవర్‌లూం పరిశ్రమ విస్తరణకు సహకారం అందించారని గుర్తుచేశారు. సిరిసిల్లకు విచ్చేసిన కావూరితో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మచ్చలేని నాయకుడు కావూరి సాంబశివరావు : నామా
మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మచ్చలేని నాయకుడు అని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కావూరి మరణం పట్ల బుధవారం తన సంతాపాన్ని ప్రకటించారు. కావూరి తన చిన్న మామయ్య అని, ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. రాజకీయాలు, వ్యాపారాల్లో మచ్చలేకుండా రాణించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రంగం, మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. కావూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

