సుదీర్ఘ విరామం తర్వాత మహాసముద్రం (Maha Samudram) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు సిద్దార్థ్ (Siddharth). ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల (AP govt ticket prices) పేరుతో చేస్తున్న ఒత్తిడిపై సిద్దార్థ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. మన్నికైన సగటు ఇంటి అద్దె, తలసరి వినియోగదారు ఖర్చును లెక్కించిన తర్వాత సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిద్ధార్థ్ సూచించాడు. తాను మొదటిసారి విదేశాల్లో సినిమా చూసినప్పుడు..ఆ సినిమా చూడటానికి ఎంత డబ్బు ఖర్చు చేశాడనేది ఉదాహరణగా చెప్పుకొస్తూ ట్వీట్ పెట్టాడు సిద్ధార్థ్.
‘విదేశాల్లో 25ఏండ్ల క్రితం తొలిసారి నా స్టూడెంట్ ఐడీ కార్డు వినియోగించి 8 డాలర్లకు ఓ సినిమా చూశా. ఆ టైంలో మన కరెన్సీలో రూ.200తో సమానం. నేడు మన సినిమాలు టెక్నాలజీ, టాలెంట్, ఉపాధి, విషయంలో అన్ని దేశాల సినిమాలకు మ్యాచ్ అవుతున్నాయి..’అని ట్వీట్ చేస్తూ సేవ్ సినిమా (#SaveCinema) హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు.
‘సినిమా బడ్జెట్ పరిధులను వినియోగదారుడు నిర్ణయించడు. అది సినిమా సృష్టికర్త, పెట్టుబడి పట్టే వ్యక్తి నిర్ణయిస్తారు. ఎవరైనా సినిమా నుంచిఎంత సంపాదిస్తారని నిర్ణయించడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశాడు. ప్రభుత్వాలు తమ పెట్టుబడిని ఎలా రికవరీ చేయాలనే ఉద్దేశ్యంతో నిరంతరం సినీ పరిశ్రమను సమస్యాత్మక అంశంగా ఎందుకు చూడాలి..?’ అని ప్రశ్నించాడు సిద్దార్థ్.
The first time I saw a movie abroad was 25 years ago. I used my student I-card and saw a movie for 8 dollars. That was Rs. 200 at the time. Today our films match all countries in technology, talent and employment…. #SaveCinema
— Siddharth (@Actor_Siddharth) December 2, 2021
A film's budget and scale is not decided by the consumer… It is decided by the creator and the investor. No individual has the right to decide how much anyone earns from cinema. #SaveCinema
— Siddharth (@Actor_Siddharth) December 2, 2021
Suggestion to respected state governments… Please calculate average house rent and per capita consumer spend on durables in an area, and device a formula to set ticket rates for cinemas in that area, if not universally. #Cinema
— Siddharth (@Actor_Siddharth) December 2, 2021
ఇవి కూడా చదవండి..
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?