వైల్డ్ డాగ్ సినిమాకు ఓపెనింగ్స్ ఏవి
వైల్డ్ డాగ్ ఓపెనింగ్స్ | నాగార్జున సినిమాలకు ఈ మధ్య ఆశించిన ఓపెనింగ్స్ రావడం లేదు. అభిమానుల సందడి కనిపిస్తుంది కానీ మునపటిలా ఓపెనింగ్స్ మాత్రం రావడం లేదనేది కాదనలేని సత్యం.

స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ రావడం సర్వ సాధారణమైన విషయం. వాళ్ల సినిమాలు ఎలా ఉన్నా తొలిరోజు హౌస్ ఫుల్ అవుతుంటుంది. అలా కాలేదు అంటే ఆ స్టార్ హీరో ఇమేజ్‌కు సమస్య వచ్చిందని అర్థం. ఇప్పుడు నాగార్జున విషయంలో ఇవే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఈ సీనియర్ హీరో సినిమాలకు ఈ మధ్య ఆశించిన ఓపెనింగ్స్ రావడం లేదు. అభిమానుల సందడి కనిపిస్తుంది కానీ మునపటిలా ఓపెనింగ్స్ మాత్రం రావడం లేదనేది కాదనలేని సత్యం. దీనికి తాజా నిదర్శనం వైల్డ్ డాగ్ ఓపెనింగ్స్.

ఐదేళ్ల కింద ఈయన నటించిన సోగ్గాడే చిన్నినాయన సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్యలో విడుదలై ఏకంగా రూ.50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత ఊపిరి సినిమా కూడా దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసింది. కానీ మంచి ఊపు మీద ఉన్న నాగార్జున మార్కెట్‌ను ఆఫీసర్ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాగా నిలిచిపోయింది. తొలి రోజు కూడా పూర్తి షోలు ఈ సినిమాకు పడలేదు. కొన్ని చోట్ల మైనస్ షేర్స్ వచ్చాయి. ఆ తర్వాత దేవదాస్ పరిస్థితి కాస్త పర్లేదు. నాని ఉన్నాడు కాబట్టి ఈ సినిమాకు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. కానీ రెండేళ్ల కిందట వచ్చిన మన్మథుడు 2 డిజాస్టర్ అయ్యింది.

ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడు సోలమన్ తెరకెక్కించిన వైల్డ్ డాగ్ సినిమాపై ముందు నుంచి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. నిజానికి కరోనా సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను నేరుగా విడుదల చేయాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే థియేటర్లు ఓపెన్ కావడంతో ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు. థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అప్పటివరకు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాపై ట్రైలర్ విడుదల తర్వాత కాస్తోకూస్తో ఆసక్తి రేగింది. అయితే అవి ఓపెనింగ్ తీసుకురావడంలో పెద్దగా ఉపయోగపడలేదని తొలిరోజు వసూళ్లను చూస్తుంటే అర్ధం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్ల దగ్గర వైల్డ్ డాగ్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇంకా ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా హౌస్ ఫుల్ కాలేదు. వైల్డ్ డాగ్ ఓపెనింగ్స్ బట్టి నాగార్జున మార్కెట్‌కు ఎంత దారుణంగా దెబ్బ పడిందో అర్థమైపోతుంది. ఇదంతా ఆఫీసర్ సినిమా నుంచి మొదలైంది. వైల్డ్ డాగ్ సినిమాకు డీసెంట్ థ్రిల్లర్ అనే టాక్ వచ్చింది. అభిమానులు సినిమా అదిరిపోయింది అంటున్నారు. అయినా సరే ఈ సమయంలో నాగార్జున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలుగుతాడా అనేది అతిపెద్ద సవాల్. వీకెండ్ ముగిస్తే కాని దీనికి సమాధానం బయటకు రాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
వైల్డ్ డాగ్ రివ్యూ
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
‘పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
కోవిడ్ టీకా తీసుకున్న మలైకా అరోరా
నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్
మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
సల్మాన్ ఖాన్ ‘రాధే’ కు నో సెన్సార్ కట్స్
ఆ వార్త నిజం కాదు..విజయ్ సినిమాపై బాలీవుడ్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

