హైదరాబాద్‌లో ఉన్న భారీ మల్టీప్లెక్సులలో మహేష్ బాబు AMB కూడా ఒకటి. సీటింగ్ పరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఇది. అదిరిపోయే సౌండ్ సిస్టమ్ తో పిచ్చెక్కిస్తుంది ఈ థియేటర్. ఏఎంబి మొదలై ఇప్పటికి మూడేళ్లు అయిపోయింది. అయితే ఇన్నేళ్లలో లేని రికార్డులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తున్నాడు. మహేష్ బాబుకు కూడా సాధ్యం కాని రికార్డులను ఇప్పుడు పవన్ కొల్లగొడుతున్నాడు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే మహేష్ అడ్డాలో పవన్ దాదాగిరి నడుస్తుంది ఇప్పుడు. అసలు విషయం ఏంటంటే.. వకీల్ సాబ్ సినిమా ఆకాశమే హద్దుగా వస్తుంది. ఆ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే అమ్మో అనుకోవాల్సిందే.
పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాపై ఉన్న అంచనాలను కూడా ఆలోచనలో పడిపోతున్నాడు. అందుకే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. పెద్దగా ప్రమోషన్ చేయకుండానే ఈ స్థాయిలో సినిమాకు హైప్ వచ్చేసింది.
ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే తొలిరోజు బాక్సాఫీస్ బెండు దీసేలా కనిపిస్తున్నాడు పవర్ స్టార్. దాదాపు 2000 థియేటర్స్ లో విడుదలవుతున్న వకీల్ సాబ్ తొలిరోజు అన్నిచోట్లా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు మల్టీప్లెక్సులో కూడా పవన్ దూకుడు కనిపిస్తుంది.
ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో AMB లో టికెట్స్ బుక్ అయిపోతున్నాయి.
నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. ఇప్పుడు చూద్దామంటే కూడా ఒక్కటి కూడా లేవు. ఒకటి రెండు కాదు.. 27 షోలు మొత్తం హౌజ్ ఫుల్స్ అయిపోయాయి. ఇది నిజంగానే కొత్త రికార్డు. విడుదలకు మూడు రోజుల ముందే ఒక్క టికెట్ కూడా లేకపోవడం రికార్డు.
గతంలో సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలైనపుడు కూడా హౌజ్ ఫుల్స్ అయ్యాయి కానీ మరీ ఇన్నేసి షోలు మాత్రం కాలేదు. హిస్టరీ చూసుకుంటే ఇప్పుడు పవన్ కొత్త చరిత్ర రాస్తున్నాడు. రెండు, మూడో రోజుల్లో కూడా దాదాపు 80 శాతం టికెట్స్ బుక్ అయిపోయాయి. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆగమనం మామూలుగా ఉండదని అర్థమైపోతుంది.
ఇవి కూడా చదవండి
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్