కల్వకుర్తి, ఏప్రిల్ 24 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ దగా చేసిన కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్ర జలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, మాడ్గుల మండలాల్లోని చింతలపల్లి, చుక్కాపూర్, ఖానాపూర్, వెంకట్రావ్‌పేట్, గట్టిప్పలపల్లి, మెదక్‌పల్లి, రాంపూర్, చంద్రధన, తలకొండపల్లి, పడకల్, రావిచేడ్, మక్తమాదారం, మైసిగండి, కర్కల్‌పహాడ్, ఎక్వాయిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ఆర్ఎస్పీ పాల్గొన్నారు. ముం దుగా ఆమనగల్లు పట్టణంలోని సంత్ సేవాలాల్ గుట్ట వద్ద సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రైతుబంధు ఇవ్వలేక బొక్కబోర్ల పడ్ల సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు వేసి ప్రజలను మరోసారి వంచిస్తున్నాడని దుయ్యబట్టారు.
తాను 26 సంవత్సరాల ఉన్నత స్థాయి పోలీస్ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాజకీయ హో దా, అధికారం కోసం, అక్రమ సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ప్రజల గొంతుకగా సమస్యలను పార్లమెంట్లో వినిపించడాని కే ఎన్నికల్లో నిల్చున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ హ యాంలో గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పనిచేసి వేలమంది విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీకారం చు ట్టి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల పిల్లల ను ఉన్నతస్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దానని చెప్పారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ఉచితవిద్య, వైద్యం ఎంతో అవసరమని దాని కోసం సీఎం కేసీఆర్ ఎంతో పరితపించి సాధ్యమైనంత వరకు అమలు చేశారన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. నాపై నమ్మకముంచి పార్లమెంట్లో మీ తరఫున ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ, అమిత్‌షా లాంటి అగ్రనాయకులు మాట్లాడుతూ బీజేపీకి 400 పార్లమెంట్ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బ హిరంగానే చెబుతున్నారని, అలా చేస్తే మన పిల్లలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలు రావని.. ఫలితంగా రోడ్ల మీద బిచ్చమెత్తుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రె స్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని బడేబాయ్-చోటేబాయి అనుకుంటున్నారని, ఎన్నికల్లో బీజేపీ, కాం గ్రెస్ పార్టీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఆప్రజాస్వామిక పాలన సాగిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో పూర్తి వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దీవించి పంపి న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ లాంటి ఉన్నత విద్యావంతుడికి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆగమాగం చేసిన తెలంగాణ రాష్ర్టానికి పూర్వవైభవం, పునర్మిర్మాణం జరగాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలంటే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ లాంటి ప్రశ్నించే గొంతుక పార్లమెంట్లో ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీలు నేనావత్ అనురాధ, దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, వైస్‌ఎంపీపీలు ఆనంద్, శంకర్, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్ఎన్ రెడ్డి, ఎంపీటీసీలు కుమార్, వెంకటయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అర్జున్‌రావు, ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, శంకర్, విజయ్‌గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోగు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.