State Bank of India : రూ.6,504 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఎస్బీఐ
State Bank of India : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తొలి త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో లాభం 55 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 6,504 కోట్లకు చేరుకున్నది

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India) తొలి త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో లాభం 55 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 6,504 కోట్లకు చేరుకున్నది. అలాగే, వడ్డీ ఆదాయాలు కూడా 4 శాంత పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభాలు రూ.4,189.34 కోట్లు.
ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, బ్యాంక్ నిర్వహణ లాభం కూడా 5 శాతం పెరిగి రూ.18,975 కోట్లకు చేరింది. బ్యాంక్ వడ్డీ ఆదాయాలు 3.74 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంలో ఇది రూ.26,641 కోట్లకు గాను రూ.27,638 కోట్లుగా ఉన్నది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఎస్బీఐ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
మొదటి త్రైమాసికంలో భారీగా లాభాలు రావడంతో ఎస్బీఐ బ్యాంక్ షేర్లలో రికార్డు పెరుగుదల కనిపించింది. ఎస్బీఐ స్టాక్ బీఎస్ఈలో 3.57 శాతం పెరిగి రూ.462.40 వద్ద ట్రేడవుతున్నది. ట్రేడింగ్ సమయంలో ఈ స్టాక్ రూ.463.55 కు చేరుకున్నది. రికార్డు ర్యాలీతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా మొదటిసారిగా రూ.4 లక్షల కోట్లు దాటింది. గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్ల స్థాయిని దాటింది.
ఇవి కూడా చదవండి..
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం
బిల్లుకు మద్దతు తెలిపి ఇప్పుడు ఆందోళనలా?
రక్షణ మంత్రి టార్గెట్‌గా కార్ బాంబు దాడి
ఆసియా తొలి న్యూక్లియార్ రియాక్టర్ ప్రారంభం
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

