నాంపల్లి, ఆగస్టు 11 : నాంపల్లి మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన పల్లేటి వెంకటమ్మ కొద్దిరోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని గ్రామ యువత ముందుకు వచ్చి గ్రామ పెద్దల సహకారంతో రూ.46,300/- సేకరించారు. సేకరించిన డబ్బుల మొత్తం మంగళవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంకటమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. .ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెరికేటి రమేశ్, ఉప సర్పంచ్ పల్లేటి దీపిక వెంకటేష్, వార్డు మెంబర్లు వడ్లకొండ ప్రవీణ్, ఆంజనేయులు, పల్స సైదులు, ఉగ్గపల్లి గిరి, దండిగ లింగయ్య, శంకరయ్య, రాజబోయిన అశోక్, వడ్లకొండ ప్రసాద్, ఆకులపల్లి నరేష్, రేగోజు రాఘవేంద్ర, శంకర్, మహేష్, బబ్లూ పాల్గొన్నారు.