MLA Naini Rajender Redy | కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తుందో స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని (MGM Hospital) పైకప్పు పెచ్చులు ఊడిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి నిధులు ఖర్చు చేయడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు.
ఎమ్మెల్యే నాయిని మీడియాతో మాట్లాడుతూ.. ఎంత చెప్పినా ఏది చేసినా.. డాక్టర్లు కానీ ఇంకొందరి స్వార్థాలకు నిజంగా ఎంజీఎం ఆస్పత్రి నిర్లక్ష్యం అవుతోంది. నిన్ననే సీఎం రివ్యూ కూడా చేశారు. ఇంకా నిర్లక్ష్యం ఏందంటే టిమ్స్ ఆస్పత్రి ప్రారంభమవుతుంది కదా.. ఇందులోకి మారుస్తున్నం కదా.. అని దాన్ని మరమ్మత్తు చేయించడానికి కూడా నిధులు ఖర్చు చేయలేదు.. అందుకే ఎంజీఎం ఆస్పత్రి ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఈ వీడియో మరోసారి స్పష్టం చేస్తోంది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి నిధులు ఖర్చు చేయడంలేదని ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం అవుతుంది కదా అని మేము ఎంజీఎం ఆసుపత్రికి నిధులు ఖర్చు చేయలేదు
అందుకే ఎంజీఎం ఆసుపత్రికి ఆ దుస్థితి
– వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్… https://t.co/djFHxNy31F pic.twitter.com/9FnmbZty5H
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన