Nose Hair : ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
Nose Hair : పరిశుభ్రంగా, అందంగా కనిపించాలని మనలో చాలా మంది అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మన అందం రెట్టింపు అవుతుందని భావిస్తుంటారు. అలాంటి అందం కోసం కొందరు ముక్కులో ఉండే వెంట్రుకలను కూడా తొలగిస్తూంటారు. ముక్కులో వెంట్రుకలు ఉండటంవల్ల కొద్దిగా అందవిహీనంగా కనిపించడం వాస్తవమే అయినప్పటికీ.. ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెప్తున్నారు.

పరిశుభ్రంగా, అందంగా కనిపించాలని మనలో చాలా మంది అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మన అందం రెట్టింపు అవుతుందని భావిస్తుంటారు. అలాంటి అందం కోసం కొందరు ముక్కులో ఉండే వెంట్రుకల (Nose Hair) ను కూడా తొలగిస్తూంటారు. ముక్కులో వెంట్రుకలు ఉండటంవల్ల కొద్దిగా అందవిహీనంగా కనిపించడం వాస్తవమే అయినప్పటికీ.. ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెప్తున్నారు.
ముక్కులో ఏర్పడే వెంట్రుకలను తీసివేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? అందం కన్నా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముక్కులో ఆ వెంట్రుకలు ఉండటం ద్వారా వాతావరణంలో ఏర్పడే దుమ్ము, ధూళి కణాలను, సూక్ష్మజీవులను ముక్కు ద్వారా శ్వాసనాళంలోకి.. తద్వారా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపుతాయని వైద్యులు సెలవిస్తున్నారు. ముక్కులో వెంట్రుకలను పీకినప్పుడు వాటి కుదుళ్ళలో ఏర్పడే రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిగి రక్త నాళాల్లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా రక్తం సరఫరా జరిగే సిరులలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. దీనినే ‘కావర్నస్ సైనస్ థ్రోంబోసిస్’ అని పిలుస్తారు. ఇది మెదడుపై అధిక ఒత్తిడిని తీసుకు రావడం వల్ల కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీస్తుంది.
ప్రస్తుత రోజుల్లో ముక్కు వ్యాక్సింగ్ చేయించుకోవడం అనేది ట్రెండింగ్గా మారింది. సోషల్ మీడియాలో ముక్కు వ్యాక్సింగ్కు సంబంధించి లెక్కకు మిక్కిలి కథనాలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తున్న పలువురు తాము కూడా ముక్కు వ్యాక్సింగ్ చేయించుకుంటున్నారు. ఇలా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ముందుగా తెలుసుకోండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముక్కు వెంట్రుకలు మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఈ వెంట్రుకలు గాలిలో ఉండే వైరస్లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే వ్యాధికారక క్రిముల నుండి రక్షణ కల్పిస్తాయి. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు అవసరమని వైద్య శాస్త్రం చెప్తున్నది.
డాక్టర్ల బృందం ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో 1896 సంవత్సరంలో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. దీని ప్రకారం, ముక్కులో కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తాయి. ఇవి కాలుష్యం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. ముక్కు వెంట్రుకలు తేమతో ఒక ఉచ్చును ఏర్పర్చి ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియాను ఊపిరితిత్తులలోకి రాకుండా చేస్తాయి. అందుకని, ముక్కులోని వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా వ్యాక్స్ చేసినప్పుడు వైరస్, బ్యాక్టీరియా కోసం ఒక క్లీన్ ట్రాక్ సృష్టించబడి అవి ఊపిరితిత్తులకు సులభంగా చేరుతాయి. అయితే, ముక్కు వెంట్రుకలపై ఇప్పటివరకు పరిమితంగానే అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో ముక్కులోని వెంట్రుకలను కత్తిరించడం లేదా వాక్సింగ్ చేయడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని ఎటువంటి ఆధారాలు లభించలేదు.
ఇవి కూడా చదవండి..
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం
బిల్లుకు మద్దతు తెలిపి ఇప్పుడు ఆందోళనలా?
రక్షణ మంత్రి టార్గెట్గా కార్ బాంబు దాడి
ఆసియా తొలి న్యూక్లియార్ రియాక్టర్ ప్రారంభం
ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

